ఇప్పుడు అవసరం... రక్తదానం
ABN , First Publish Date - 2020-04-16T10:02:02+05:30 IST
‘‘కోవిడ్ 19 భయం వల్ల చాలామంది బయటకు వచ్చి రక్తదానం చేయడం లేదు. భయపడుతున్నారు. కరోనాకు, రక్తదానానికి ఎటువంటి సంబంధం లేదు...

‘‘కోవిడ్ 19 భయం వల్ల చాలామంది బయటకు వచ్చి రక్తదానం చేయడం లేదు. భయపడుతున్నారు. కరోనాకు, రక్తదానానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ సమయంలో బ్లడ్, బ్లడ్ డొనేట్ చేయడం మరింత అవసరం. మనం దానం చేసే రక్తం ఎంతోమందికి ఉపయోగపడుతుంది’’ అని నాని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో బుధవారం ఆయన బ్లడ్ డొనేట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అందుకని, అందరం ఇంట్లో ఉంటున్నాం. అయితే... మనకి తెలియని సమస్యలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది... చాలామంది పేషెంట్లు రక్తం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా తలసీమియా వచ్చిన చిన్నారులు 3500 మంది ఉన్నారు. వాళ్లకు నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించాలి. అందుకు, చాలా రక్తం అవసరం. ఇతర పేషెంట్లు సైతం రక్తం కావాలి’’ అన్నారు.