కరణ్‌ జోహార్‌కి ఎన్‌సీబీ నోటీసులు

ABN , First Publish Date - 2020-12-18T20:15:42+05:30 IST

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌కు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు.

కరణ్‌ జోహార్‌కి ఎన్‌సీబీ నోటీసులు

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌కు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తీసుకున్న తర్వాత సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ దర్యాప్తుల డ్రగ్ర్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో సుశాంత్‌ సింగ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సహా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సంజన, రాగిణి ద్వివేదిలను అరెస్ట్‌ చేశారు. దీపికా పదుకొనె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌, మధుమంతెన, క్షితిజ్‌ ప్రసాద్‌, కరిష్మా ప్రకాశ్‌ వంటి వారిని విచారించారు. ఈ క్రమంలో గత ఏడాది జూలైలో కరణ్‌ జోహార్‌ ఏ పార్టీని ఇచ్చాడని, ఆ పార్టీలో డ్రగ్స్‌ను ఉపయోగించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్‌సీబీ అధికారులు కరణ్‌జోహార్‌కు సమన్లు జారీ చేశారు. 


Updated Date - 2020-12-18T20:15:42+05:30 IST