ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే!

ABN , First Publish Date - 2020-09-24T06:54:49+05:30 IST

తమిళ హీరో విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రం థియేటర్లలోనే విడుదలవుతుందనీ, ఓటీటీలో రిలీజ్‌ చేయమని స్పష్టం చేశారు ఆ చిత్ర దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌...

ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే!

మాస్టర్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌

తమిళ హీరో విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రం థియేటర్లలోనే విడుదలవుతుందనీ, ఓటీటీలో రిలీజ్‌ చేయమని స్పష్టం చేశారు ఆ చిత్ర దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌. మిగిలిన చిత్రాలలాగానే ‘మాస్టర్‌’ కూడా త్వరలోనే ఓటీటీలో విడుదలవుతుందని వినిపిస్తున్న ఊహాగానాలకు ఆయన తెర దించారు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నామనీ, ఓపెన్‌ చేసిన తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తామనీ లోకేశ్‌ చెప్పారు. విజయ్‌ అభిమానులు కోయంబత్తూరులో ఏర్పాటు చేసిన సేవాకార్యక్రమంలో లోకేశ్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘చిత్ర పరిశ్రమలోని పెద్దలతో నేను రోజూ మాట్లాడుతూనే ఉన్నాను. థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యేలా వారు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. థియేటర్లు మూతపడి ఇప్పటికి ఏడు నెలలు అయింది. ఇంకా ఆలస్యం చేస్తే వాటి మీదే ఆధారపడిన వేలాది మంది నానా ఇబ్బందులు పడతారు. చూద్దాం.. ఏం జరుగుతుందో’ అన్నారాయన.  విజయ్‌ సేతుపతి, మాళవిక మోహనన్‌ తదితరులు నటించిన ‘మాస్టర్‌’ చిత్రం మొన్న ఏప్రిల్‌ 9న విడుదల కావాలి. 

Updated Date - 2020-09-24T06:54:49+05:30 IST