ఆ సినిమాల‌పై ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం!!

ABN , First Publish Date - 2020-08-02T15:50:44+05:30 IST

ఇక‌పై ఎవ‌రైనా ఇండియ‌న్ ఆర్మీపై సినిమాలు తీయాల‌నుకుంటే.. కేంద్ర కేంద్ర ర‌క్ష‌ణ‌కు సంబంధించిన మంత్రిత్వ శాఖ నుండి నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఆ సినిమాల‌పై ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం!!

దేశ‌భ‌క్తి సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌య్యాయి. ముఖ్యంగా ఇండియ‌న్ ఆర్మీలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని మ‌న మేక‌ర్స్ క‌థ‌ల‌ను రాసుకుని సినిమాల రూపంలో చిత్రీక‌రిస్తున్నారు. అయితే కొన్నింటిలో ఇండియ‌న్ ఆర్మీ గురించి త‌ప్పుగా చూపించ‌డంతో పాటు త‌క్కువ చేసి చూపిస్తున్నారనే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై ఎవ‌రైనా ఇండియ‌న్ ఆర్మీపై సినిమాలు తీయాల‌నుకుంటే.. కేంద్ర కేంద్ర ర‌క్ష‌ణ‌కు సంబంధించిన మంత్రిత్వ శాఖ నుండి నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ముందు స్క్రిప్ట్ చూపించి ఎన్‌.ఓ.సి తీసుకోవ‌డంతో పాటు సినిమా విడుద‌ల‌కు ముందు సినిమా లేదా వెబ్ సిరీస్‌లోని ఆర్మీ శాఖ‌కు సంబంధించిన సన్నివేశాల‌ను చూపించాల‌ని ఇండియ‌న్ ఆర్మీ పేర్కొంది. ఎన్ఓసీ లేని సినిమాల‌కు సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇవ్వకూడ‌దంటూ కేంద్రం నిర్ణ‌యించింది. 

Updated Date - 2020-08-02T15:50:44+05:30 IST