వద్దు... అది నా పర్సనల్‌ స్పేస్‌!

ABN , First Publish Date - 2020-04-28T04:49:02+05:30 IST

లాక్‌డౌన్‌లో కథానాయిక రష్మికతో ఓ సోషల్‌ చిట్‌ఛాట్‌! టకటకా ప్రశ్నలు అడిగితే... చకచకా రాకెట్‌ స్పీడ్‌లో ఆమె సమాధానాలు ఇచ్చారు. మీరూ సరదాగా చదువుకోవచ్చు!!...

వద్దు... అది నా పర్సనల్‌ స్పేస్‌!

లాక్‌డౌన్‌లో కథానాయిక రష్మికతో ఓ సోషల్‌ చిట్‌ఛాట్‌! టకటకా ప్రశ్నలు అడిగితే... చకచకా రాకెట్‌ స్పీడ్‌లో ఆమె సమాధానాలు ఇచ్చారు. మీరూ సరదాగా చదువుకోవచ్చు!!లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు?

నిద్రపోతున్నా. తింటున్నా. పుస్తకాలు చదువుతున్నా. పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నా. వ్యాయామం చేస్తున్నా. మళ్లీ నిద్రపోతున్నా.


మీ సినిమాలు చూస్తున్నారా?

(ఎరుపెక్కిన బుగ్గలతో...) నేను టీవీ ఎక్కువ చూడను. ఇంట్లో నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అల్లరి ప్రాణులు చాలా ఉన్నాయి.


ఖాళీ సమయాల్లో వంట చేస్తారా?

నేను కాలుస్తా!


అభిమానులు, ప్రేక్షకుల కోసం మీ ఇల్లు చూపించవచ్చు కదా! వీడియో, ఫొటోల్లో...

వద్దు... అది నా పర్సనల్‌ స్పేస్‌!


సోషల్‌ మీడియాలో మీ మొబైల్‌ స్కీన్‌షాట్‌ షేర్‌ చేశారు. అందులో 23,968 అన్‌రీడ్‌ (చదవని) మెయిల్స్‌ ఉన్నాయి. ప్లీజ్‌... ఓపెన్‌ చేయండి!

నాకు మూడు మెయిల్‌ ఐడీలు ఉన్నాయి. రష్మికరీడ్స్‌ మెయిల్‌ ఐడీ(ఔత్సాహిక రచయితలు, కథలు పంపమని ఇటీవల ఆమె కోరారు. అందుకోసం కోసం క్రియేట్‌ చేసిన ఐడీ)కి వచ్చినవి చదవడం ప్రారంభించాక... మిగతా మెయిల్స్‌ చూడడం మానేశా.


నటనను మీ కెరీర్‌గా ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

ఒక్క క్షణమైనా సరే... ఏదో ఒక విధంగా ప్రేక్షకుల చిరునవ్వుకు నేను కారణం కావచ్చు అని!


‘పుష్ప’ కోసం చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట! నిజమేనా?

మీకు ఎలా తెలిసింది? నిజమే! 


చివరగా... లాక్‌డౌన్‌ తర్వాత మీరు చేసే మొదటి పని?

నా స్నేహితులను చూస్తా. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు... ఆరు అడుగులు దూరం పాటించడంతో పాటు మేమంతా మాస్కులు ధరిస్తాం!

Updated Date - 2020-04-28T04:49:02+05:30 IST