చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఏం లేదు

ABN , First Publish Date - 2020-06-12T02:25:46+05:30 IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు వర్గాలు ఉన్నాయని, ఒకటి మెగా, రెండు నందమూరి వర్గాలు అంటూ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య అటు హీరోలు, ఇటు అభిమానుల

చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఏం లేదు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు వర్గాలు ఉన్నాయని, ఒకటి మెగా, రెండు నందమూరి వర్గాలు అంటూ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య అటు హీరోలు, ఇటు అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంటుంది. ఆ ప్రచారం ఈ మధ్య బాలయ్య కామెంట్స్‌తో మరింతగా ముదిరింది. బాలయ్య, చిరంజీవి మంచి స్నేహితులం అని చెప్పుకుంటారు కానీ అది కేవలం మాటల వరకే అనేది ఈ మధ్య జరుగుతున్న కొన్ని విషయాలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపెట్టాయి. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్స్ మొదలయ్యాయి. అభిమానులు ఒకడుగు ముందుకు వేసి తిట్టుకునే స్టేజ్‌కి వెళ్లిపోయారు. అయితే నందమూరి నటసింహ బాలకృష్ణ బర్త్‌డే మాత్రం ఇండస్ట్రీ వర్గాలకు అలాగే అభిమానులకు ఇండస్ట్రీలో ఎటువంటి గొడవలు, బేధాలు లేవని చెప్పకనే చెప్పేసింది.


అదెలా అంటే స్టార్ హీరోలందరూ బాలయ్యకు పుట్టినరోజున ఎంతో ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపి.. గాసిప్స్ ప్రచారం చేసే వారి నోళ్లు మూతపడేలా చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, తారక్, వెంకటేష్ ఇలా ప్రతి ఒక్కరూ బాలయ్యకు షష్ఠిపూర్తి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆత్మీయంగా తెలిపారు. ఇక రీసెంట్‌గా జరిగిన విషయాలు ఇండస్ట్రీ పరంగానే కానీ, వ్యక్తిగతంగా కాదనేలా చిరంజీవి ట్వీట్ మెగా, నందమూరి అభిమాన వర్గాలకు తెలిసి వచ్చేలా చేసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇకనైనా అభిమానులందరూ ఈ గొడవలు పక్కన పెట్టి.. వారి హీరోల వలే ఉంటారని ఆశిద్దాం.

Updated Date - 2020-06-12T02:25:46+05:30 IST