‘నో పెళ్లి..’ వీడియో సాంగ్‌ను విడుదల చేసిన నితిన్
ABN, First Publish Date - 2020-05-25T16:51:21+05:30
సాయితేజ్ యువకులందరినీ బ్యాచిలర్స్‌గా మారాలని చెప్తున్నాడు. ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు అంటూ పాట పాడుతున్నాడు. ఇంతకూ సాయితేజ్ అలా ఎందుకు చెబుతున్నాడో తెలుసుకోవాలంటే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చూడాల్సిందేనని మేకర్స్ అంటున్నారు.
సాయితేజ్ యువకులందరినీ బ్యాచిలర్స్‌గా మారాలని చెప్తున్నాడు. ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు అంటూ పాట పాడుతున్నాడు. ఇంతకూ సాయితేజ్ అలా ఎందుకు చెబుతున్నాడో తెలుసుకోవాలంటే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చూడాల్సిందేనని మేకర్స్ అంటున్నారు. వివరాల్లోకెళ్తే.. సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రంతో సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో సినిమాకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. తాజాగా ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్‌ను సోమవారం నితిన్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.