సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్వీటీ ఎంత అడిగితే అంత ఇచ్చేయమన్న వర్మ

ABN, First Publish Date - 2020-07-03T03:12:07+05:30

ఏమి సంచలనమో.. ఏమో గానీ.. రామ్ గోపాల్ వర్మ అంటే చాలు ఇప్పుడొక వర్గం ప్రేక్షకులు భయపడిపోతున్నారు. ఒకప్పుడు ఆయన సినిమా ప్రకటిస్తే అందులో ఎంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏమి సంచలనమో.. ఏమో గానీ.. రామ్ గోపాల్ వర్మ అంటే చాలు ఇప్పుడొక వర్గం ప్రేక్షకులు భయపడిపోతున్నారు. ఒకప్పుడు ఆయన సినిమా ప్రకటిస్తే అందులో ఎంతో కొంత కొత్త విషయం ఉండేదనే నమ్మకం ఉండేది. ఇప్పుడు అసలు ఏమి తీస్తున్నాడో.. ఎలాంటి దర్శకుడు ఎలా అయిపోయాడో అంటూ ఆయనను అమితంగా అభిమానించే వారే అనుకుంటుండటం విశేషం. ఇక ఈ మధ్య ఆయన రిలీజ్ చేస్తున్న సినిమాల గురించి ప్రస్తావించాల్సి వస్తే.. దానికి ఓ గ్రేడు పెట్టాల్సిందే. ‘శివ’ సినిమా తీసిన వర్మేనా ఈ సినిమాలు రూపొందిస్తుంది అని అంతా డౌట్ పడాల్సిందే. అయినా అదే నిజం. ఇకపోతే తాజాగా ఆయన ఓ బూతు చిన్న సినిమాని విడుదల చేశారు. అందులో స్వీటీ అనే అమ్మాయిని ఎన్ని రకాలుగా చూపించారో.. వర్మ పెట్టించిన కెమెరాకే తెలియాలి.


ఆ స్వీటీ అనే అమ్మాయి వర్మ విడుదల చేసిన తాజా చిత్రం గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాకు ఆమె రెమ్యూనరేషన్ రోజుకి లక్ష అని తీసుకున్నారట. అయితే ఒక్క రోజులోనే సినిమా షూట్ చేశారని, ఆ తదుపరి రోజు డబ్బింగ్ పూర్తి చేశారని తెలిపింది. అయితే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం స్వీటీ పనితనాన్ని మెచ్చుకుని ఆమె ఎంత అడిగితే అంత ఇచ్చేయండి అని వర్మ తన మేనేజర్‌కి చెప్పాడట. దీనిని బట్టి ఎవరేం ఊహించుకుంటారో వాళ్లిష్టం. ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు.

Updated Date - 2020-07-03T03:12:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!