బరువు తగ్గనున్న నివేదా పేతురాజ్

ABN , First Publish Date - 2020-05-26T18:50:12+05:30 IST

‘ఒరు నాళ్‌ కూత్తు’ చిత్రం ద్వారా తమిళ సినిమాకు పరిచయమైన నివేదా పేతురాజ్‌ ప్రస్తుతం తెలుగులోనూ అవకాశాలు సంపాదిస్తోంది. ‘అల వైకుంఠపురం’లో ప్రాధాన్యత లేని పాత్రలోనే నటించినా ఇతర సినిమాల్లో అవకాశాలు తెచ్చేందుకు ఇది దోహదపడుతోందట.

బరువు తగ్గనున్న నివేదా పేతురాజ్

‘ఒరు నాళ్‌ కూత్తు’ చిత్రం ద్వారా తమిళ సినిమాకు పరిచయమైన నివేదా పేతురాజ్‌ ప్రస్తుతం తెలుగులోనూ అవకాశాలు సంపాదిస్తోంది. ‘అల వైకుంఠపురం’లో ప్రాధాన్యత లేని పాత్రలోనే నటించినా ఇతర సినిమాల్లో అవకాశాలు తెచ్చేందుకు ఇది దోహదపడుతోందట. అయితే ఆమె బరువు ఆమెకు ఇబ్బందిగా మారిందట. దీంతో బరువు తగ్గేందుకు నివేదా తీవ్రంగా ప్రయత్నిస్తోందట. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ గ్లామర్‌ స్టిల్స్‌ విడుదల చేస్తూ సందడి చేసే ఈ గ్లామరస్‌ భామ.. లాక్‌డౌన్‌ ముగిసి షూటింగ్‌లు మొదలయ్యే లోపు నాజూగ్గా మారిపోవాలని ఆశిస్తోంది.

Updated Date - 2020-05-26T18:50:12+05:30 IST