నివేదా పేతురాజ్‌కు అభ్యంతరం లేదట

ABN , First Publish Date - 2020-05-13T03:25:36+05:30 IST

ఫ్యామిలీ గాళ్‌గా గుర్తింపు సంపాదించుకున్న కొంతమంది హాట్ బ్యూటీస్‌కు బేసికల్‌గా గ్లామర్ రోల్స్ అంటేనే ఇష్టం. దాంతో తమ మీద పడ్డ ఫ్యామిలీ ఇమేజ్ చెరిపేసుకోవడానికి పడరాని

నివేదా పేతురాజ్‌కు అభ్యంతరం లేదట

ఫ్యామిలీ గాళ్‌గా గుర్తింపు సంపాదించుకున్న కొంతమంది హాట్ బ్యూటీస్‌కు బేసికల్‌గా గ్లామర్ రోల్స్ అంటేనే ఇష్టం. దాంతో తమ మీద పడ్డ ఫ్యామిలీ ఇమేజ్ చెరిపేసుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. నాలుగేళ్ళ క్రితం వరునాళ్ కూతు సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. ఆ తరువాత ఏడాదే ‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా పరాజయం పాలైనా తనదైన బాడీ లాంగ్వేజ్‌తో తెలుగు ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలను ఆకట్టుకుంది. దాంతో ‘చిత్రలహరి’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమాతో పాటు ‘బ్రోచేవారెవరురా’ చిత్రం కూడా ఆమెకు చక్కని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ రెండు సినిమాలు విజయం సాధించినా.. పెద్ద స్టార్స్ సినిమాలలో ఆమెకు అవకాశాలు రాలేదు. అయినా హీరోయిన్ పాత్రల కోసం వేచి చూడకుండా ‘అల వైకుంఠపురములో..’ సుశాంత్ సరసన నటించడానికి సై అంది. తీరా సినిమా చూశాక చాలా మంది.. ఇది నివేదాకు తగిన పాత్ర కాదని తేల్చి చెప్పేశారు. 


అయితే ఆమె పాత్రకు న్యాయం చేయలేకపోయామన్న భావన అటు అల్లు అర్జున్, అలాగే త్రివిక్రమ్‌కు ఉందని వినిపించింది. అందుకే బన్నీ తన కొత్త సినిమా ‘పుష్ప’లో ఆమెకు స్థానం కల్పించాడట. అలాగే త్రివిక్రమ్ తదుపరి సినిమాలోనూ ఆమెకు మంచి పాత్ర ఉంటుందని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఫ్యామిలీ టైప్ పాత్రలే చేసిన ఈ భామ.. తనలోని గ్లామర్ యాంగిల్ బయట పెట్టేందుకు ఈ లాక్‌డౌన్‌ను బాగా వినియోగించుకుంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ స్టిల్స్ పోస్ట్ చేస్తూ యూత్‌కు గాలం వేస్తుంది. వెండితెర మీద గ్లామర్‌గా కనిపించడానికి నాకేం అభ్యంతరాలు లేవని ఈ ఫొటోలతో చెప్పకనే చెబుతుంది. ఆ మధ్య హాట్‌గా ఉండటం నేరమైతే.. నన్ను అరెస్ట్ చేసుకోండి అని స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చింది. అన్నట్లు పవన్ సరసన కూడా ఈ భామకు చోటు దక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే.. త్వరలోనే ఈ భామ బిజీ హీరోయిన్ అయ్యేలా కనిపిస్తుందని అంటున్నారు. మరి స్టార్ హీరోయిన్ కావాలనే ఈ అమ్మడి కోరిక నెరవేరుతుందో లేదో చూద్దాం. 

Updated Date - 2020-05-13T03:25:36+05:30 IST