శరీర బరువు గురించి నిత్య కామెంట్!

ABN , First Publish Date - 2020-07-03T17:42:22+05:30 IST

తన శరీర బరువు గురించి విమర్శలు చేస్తున్న వారికి హీరోయిన్ నిత్యా మీనన్ ఘాటు రిప్లై ఇచ్చింది.

శరీర బరువు గురించి నిత్య కామెంట్!

తన శరీర బరువు గురించి విమర్శలు చేస్తున్న వారికి హీరోయిన్ నిత్యా మీనన్ ఘాటు రిప్లై ఇచ్చింది. తన ఫ్రొఫెషనల్‌ లైఫ్‌లో వంక పెట్టడానికి ఏమీ లేకపోవడం వల్లే చాలా మంది తన శరీర బరువును వేలెత్తి చూపుతున్నారని నిత్య అభిప్రాయపడింది. శరీర బరువు విషయంలో సినీ పరిశ్రమకు చెందిన వారే చాలా మంది తనను విమర్శించారని నిత్య గుర్తు చేసుకుంది. 


`అవును.. నేనే కాదు చాలా మంది బాడీ షేమింగ్‌కు గురై ఉంటారు. మన శరీర బరువు గురించి మన కంటే వారే ఎక్కువ ఆలోచిస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయంటారు. రకరకాల విశ్లేషణలు చేస్తారు. అయితే అవన్నీ చాలా చిన్నవి. నా వ్యక్తిగత విషయాల గురించి బయట మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. సినీ పరిశ్రమ వారు నన్ను చూస్తున్నారా? లేక నా బరువును చూస్తున్నారా? అనే విషయాన్ని పట్టించుకోవడం మానేశాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. అదే నా గురించి మాట్లాడుతుంద`ని నిత్య చెప్పింది.  


Updated Date - 2020-07-03T17:42:22+05:30 IST