కంగన `తలైవి`పై నిత్య కామెంట్స్!

ABN , First Publish Date - 2020-07-16T02:39:50+05:30 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్, రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి.

కంగన `తలైవి`పై నిత్య కామెంట్స్!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్, రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వెబ్ సిరీస్‌లో రమ్యకృష్ణ, `తలైవి` సినిమాలో కంగనా రనౌత్, `ఐరన్ లేడీ` సినిమాలో నిత్యా మీనన్ నటిస్తున్నారు. ఈ మూడింట్లోనూ కంగన `తలైవి` మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన నిత్య.. `తలైవి` గురించి స్పందించింది. 


`జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్స్ అన్నింటిలో మాది విభిన్నంగా ఉంటుంది. జయలలిత బయోపిక్‌గా వేరే వారు తీసేది సినిమా మాత్రమే.. కానీ, మాది మాత్రం జీవితం. జయలలిత జీవితాన్ని మేము అభిమానుల ముందు ఆవిష్కరించబోతున్నాం.  మా సినిమా దర్శకుడు జయలలితగారికి అత్యంత ఆప్తుడు. ఆమె జీవితాన్ని చాలా దగ్గరగా చూశాడు. ఆయన మాత్రమే జయలలిత గురించి నిజాలు చూపించగలడ`ని నిత్య అభిప్రాయపడింది. 


Updated Date - 2020-07-16T02:39:50+05:30 IST