నిత్యామీనన్‌ ‘నిన్నిలా నిన్నిలా’

ABN , First Publish Date - 2020-09-29T06:44:23+05:30 IST

నిత్యామీనన్‌ కథానాయికగా ‘నిన్నిలా నిన్నిలా’ సినిమా రూపొందుతోంది. ‘పిజ్జా-2’ అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అశోక్‌ సెల్వన్‌ ఈ సినిమాతో...

నిత్యామీనన్‌ ‘నిన్నిలా నిన్నిలా’

నిత్యామీనన్‌ కథానాయికగా ‘నిన్నిలా నిన్నిలా’ సినిమా రూపొందుతోంది. ‘పిజ్జా-2’ అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అశోక్‌ సెల్వన్‌ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అని శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. కొంతగ్యాప్‌ తర్వాత సెట్‌లో అడుగుపెట్టిన నిత్యామీనన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అశోక్‌ సెల్వన్‌తో కలిసి తింటున్న ఫొటోను షేర్‌ చేశారు. ‘‘వారం రోజులుగా మేమిద్దరం ఒకే సెట్‌లో పని చేస్తున్నాం. ఒకే ప్లేట్‌లో తింటున్నాం. అశోక్‌తో చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. త్వరలో దేవ్‌, మాయగా తెరపై అలరిస్తాం’’ అని నిత్యా పోస్ట్‌ చేశారు. తెలుగులో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని అశోక్‌ సెల్వన్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-29T06:44:23+05:30 IST