వాలంటైన్స్ డే సర్‌ప్రైజ్: నితిన్ కాబోయే భార్య ఎవరో తెలిసిపోయింది..!

ABN , First Publish Date - 2020-02-14T20:13:44+05:30 IST

టాలీవుడ్‌లో ఉన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ జాబితా గురించి చెప్పుకోవాలంటే అందులో...

వాలంటైన్స్ డే సర్‌ప్రైజ్: నితిన్ కాబోయే భార్య ఎవరో తెలిసిపోయింది..!

టాలీవుడ్‌లో ఉన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ జాబితా గురించి చెప్పుకోవాలంటే అందులో టాప్5లో హీరో నితిన్ పేరు తప్పకుండా ఉంటుందనడంలో సందేహం లేదేమో. కానీ.. ఈ ప్రేమికుల దినోత్సవం సాక్షిగా నితిన్ తనకు కాబోయే భార్య ఎవరో బయటపెట్టేశాడు. ఈ ‘టక్కరి’ కుర్రాడు మనసు పడ్డ అమ్మాయి పేరు శాలిని కందుకూరి. ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. తన లవ్ స్టోరీలో ఎలాంటి సినిమా మలుపులు లేవని, తొలి చూపులోనే ప్రేమించుకోవడం.. పెద్దలు కాదనడం లాంటివేవి జరగలేదని చెప్పాడు. తనకు శాలిని ఎనిమిదేళ్లుగా తెలుసని, గత ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నామని తమ ప్రేమకథను గురించి నితిన్ వివరించాడు.


హైదరాబాద్‌కు చెందిన శాలిని యూకేలోని యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసిందని, ఇటీవలే సిటీకి తిరిగొచ్చిందని చెప్పాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరం పరిచయం అయ్యామని, ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నామని తెలిపాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పెద్దలకు చెప్పేశామని.. పెద్దలు ఒప్పుకున్నారని నితిన్ చెప్పాడు. నితిన్, శాలిని ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో జరగనుంది. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, ఏప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించున్నట్లు ఈ 36 ఏళ్ల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చెప్పేశాడు.

Updated Date - 2020-02-14T20:13:44+05:30 IST