ఆయ‌న్ని కాపీ కొట్టాను.. చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంది: నితిన్‌

ABN , First Publish Date - 2020-02-26T02:28:02+05:30 IST

`సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. మా టీం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ ఇది` అన్నారు నితిన్‌.

ఆయ‌న్ని కాపీ కొట్టాను.. చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంది:  నితిన్‌

`సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. మా టీం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ ఇది` అన్నారు నితిన్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `భీష్మ‌`. ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌లైన ఈ సినిమా స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నితిన్ మాట్లాడుతూ ``నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. నేను చేసిందల్లా డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టడమే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు. ఈ సినిమా కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. ఈ హిట్ తో చాలామందికి అతను జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. అందుకే ఎమోషనల్ అవుతున్నా. మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ ఇచ్చిన రీరికార్డింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. రష్మికతో కంటే సంపత్ రాజ్ తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. కాసర్ల, శ్రీమణి చాలా మంచి పాటలు ఇచ్చారు. 'ఛలో'తో వెంకీకి, 'భీష్మ'తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది. తను ఇంకా ఎన్నో హిట్లు కొట్టి ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. 'అ ఆ'తో నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్టిచ్చిన బ్యానర్ లోనే నాకు మళ్లీ హిట్ వచ్చింది. ఈ సంస్థలో మరెన్నో సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

Updated Date - 2020-02-26T02:28:02+05:30 IST