కాజల్ పెళ్లి.. నిషా ఎమోషనల్!

ABN , First Publish Date - 2020-10-30T20:01:32+05:30 IST

కాజల్ అగర్వాల్‍‍‍ మరికొద్ది సేపట్లో తన బ్యాచిలర్ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టబోతోంది.

కాజల్ పెళ్లి.. నిషా ఎమోషనల్!

కాజల్ అగర్వాల్‍‍‍ మరికొద్ది సేపట్లో తన బ్యాచిలర్ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టబోతోంది. తను ప్రేమించిన గౌతమ్ కిచ్లూకి భార్యగా మారబోతోంది. కరోనా కారణంగా ఈ పెళ్లికి ఎక్కువ మందిని ఆహ్వానించలేదు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కాజల్ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో కాజల్ తాజాగా షేర్ చేసిన నిషా ఫొటో వైరల్ అవుతోంది. 


మెహందీ హల్ది వేడుకల్లో కాజల్ సోదరి నిషా అగర్వాల్ భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు పెట్టుకుంది. నిషా ఎమోషనల్ అవుతున్న క్షణానికి సంబంధించిన అరుదైన ఫోటోను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. Updated Date - 2020-10-30T20:01:32+05:30 IST