కాజల్ లవ్‌స్టోరీ.. నిషా కామెంట్!

ABN , First Publish Date - 2020-10-27T21:25:34+05:30 IST

చందమామ కాజల్ అగర్వాల్ మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది

కాజల్ లవ్‌స్టోరీ.. నిషా కామెంట్!

చందమామ కాజల్ అగర్వాల్ మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తను ప్రేమించిన గౌతమ్ కిచ్లూను ఈ నెల 30న వివాహం చేసుకోబోతోంది. కరోనా రోజులు కావడంతో చాలా తక్కువ మంది అతిథుల మధ్య ఈ వివాహం జరుగబోతోంది. కాజల్ పెళ్లి ఏర్పాట్ల గురించి ఆమె సోదరి నిషా అగర్వాల్ తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడింది. 


`కరోనా కారణంగా వివాహ వేడుకలు తక్కువ మోతాదులోనే ఉంటాయి. అయితే ఈ పెళ్లి ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పెళ్లి రోజు చిన్నపాటి సంగీత్ కార్యక్రమం ఉంటుంది. ఆ ఏర్పాట్లన్నీ మా నాన్న చూసుకుంటున్నారు. ఇది మాకు చాలా ప్రత్యేక సమయం. కాజల్ కొత్త జీవితం పట్ల మేమెంతో ఆసక్తిగా ఉన్నాం. కాజల్‌తో వీలైనంత ఎక్కువ సమయం గడుపుతున్నాం. గౌతమ్ చాలా మంచి వ్యక్తి. మా కుటుంబంలోకి అలాంటి వ్యక్తి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాజల్ ప్రేమకథ గురించి ఆమె నోటి ద్వారా వింటేనే బాగుంటుంది. పెళ్లి పనులన్నీ అయిపోయిన తర్వాత ఆమె చెబుతుంద`ని నిషా పేర్కొంది. 

Updated Date - 2020-10-27T21:25:34+05:30 IST