‘నిన్నిలా నిన్నిలా’ ఫస్ట్‌ లుక్‌

ABN , First Publish Date - 2020-10-21T10:40:59+05:30 IST

అశోక్‌ సెల్వన్‌ హీరోగా, నిత్యా మీనన్‌, రీతూ వర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. ఇటీవల టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్...

‘నిన్నిలా నిన్నిలా’ ఫస్ట్‌ లుక్‌

అశోక్‌ సెల్వన్‌ హీరోగా, నిత్యా మీనన్‌, రీతూ వర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. ఇటీవల టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. బాపినీడు .బి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి పాటలు: శ్రీమణి, మాటలు: నాగచందు, అనూష, జయంత్‌ పానుగంటి, సంగీతం: రాజేశ్‌ మురుగేశన్‌, దర్శకత్వం: అని ఐ.వి. శశి.

Updated Date - 2020-10-21T10:40:59+05:30 IST