డైరెక్షన్‌పై నిఖిల్‌ క్లారిటీ..!

ABN , First Publish Date - 2020-09-16T18:40:35+05:30 IST

త్వరలోనే నిఖిల్‌ మెగాఫోన్‌ పట్టనున్నారని, పిల్లలను ప్రధాన పాత్రధారులుగా పెట్టి నిఖిల్‌ ఓ సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నారనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ....

డైరెక్షన్‌పై నిఖిల్‌ క్లారిటీ..!

ఈ ఏడాది లాక్‌డౌన్‌ సమయంలోనే పెళ్లి చేసుకున్న హీరో నిఖిల్‌.. కోవిడ్‌ ప్రభావంతో ఆగిన తన తదుపరి సినిమాలను ఎప్పుడు స్టార్ట్‌ చేయాలనే దానిపై ఫుల్ ఫోకస్‌ పెట్టారు. అయితే త్వరలోనే నిఖిల్‌ మెగాఫోన్‌ పట్టనున్నారని, పిల్లలను ప్రధాన పాత్రధారులుగా పెట్టి నిఖిల్‌ ఓ సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నారనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై హీరో నిఖిల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. "మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మేం పిల్లల సినిమాకు సంబంధించి బౌండెడ్‌ స్క్రిప్ట్‌ను రాశాం. నేను త్వరలోనే ఎలాంటి సినిమాను డైరెక్ట్‌ చేయడం లేదు. ప్రస్తుతం నేను నటిస్తున్న రెండు చిత్రాలు 18 పేజీస్‌, కార్తికేయ 2 సినిమాలు అక్టోబర్‌, నవంబర్‌ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రాల షూటింగ్స్‌తో నేను ఫుల్‌ బిజీ అవుతున్నాను. త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం" అన్నారు నిఖిల్‌. 
Updated Date - 2020-09-16T18:40:35+05:30 IST