ట్రంప్‌పై పవన్ హీరోయిన్ ట్వీట్.. నెట్టింట మొదలైన గుసగుసలు

ABN , First Publish Date - 2020-02-26T18:57:46+05:30 IST

భారత్‌ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ సర్కార్ అపూర్వ స్వాగత సత్కారాలు చేసి..

ట్రంప్‌పై పవన్ హీరోయిన్ ట్వీట్.. నెట్టింట మొదలైన గుసగుసలు

హైదరాబాద్: భారత్‌ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ సర్కార్ అపూర్వ స్వాగత సత్కారాలు చేసి.. అహో అనేలా చేసింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో విందు అనంతరం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ రెండు రోజులూ నెట్టింట ట్రంప్ - మోదీ నామస్మరణే సాగింది. ఈ పర్యటనపై నెట్టింట రకరకాల కామెంట్లు .. వార్తలు షేర్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సినీ నటి, పులి సినిమా హీరోయిన్ నికీషా పటేల్ చేసిన ట్వీట్ నెట్టింట గుసగుసలకు కారణమైంది. ఇంతకూ ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే... జాతీయ మీడియాలో మాట్లాడిన ఓ నటి.. డొనాల్డ్ ట్రంప్‌ను డొనాల్డ్ డంప్ అనడం తాను విన్నానని.. అనుకోకుండా జరిగిపోయిందని చెబుతున్నా.. అయితే ఆ పిలుపు మాత్రం కావాలనే చేసినట్టుగా ఉందని ట్వీట్ చేసింది.


ఈ ట్వీట్‌పై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్‌పై అంత సాహసం చేసిందెవరా అన్న ఆలోచనల్లో నెటిజన్లు పడిపోయారు. అయితే కొంతమంది ట్రంప్‌నే తప్పు పడుతూ.. ఆయన పేర్లను పలికే విధానంపై కామెంట్లు చేస్తున్నారు. సచిన్ పేరును సుచిన్‌గా పలికారు కదా.... అందుకే ఆయనను డంప్ అని ఉండొచ్చు అంటున్నారు. Updated Date - 2020-02-26T18:57:46+05:30 IST