కాబోయే భ‌ర్త‌కి నిహారిక బ‌ర్త్‌డే విశెష్ ఎలా చెప్పిందంటే..

ABN , First Publish Date - 2020-07-27T04:34:52+05:30 IST

మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయమై పూర్తి క్లారిటీ వచ్చేసిన విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో ఆమె వివాహం

కాబోయే భ‌ర్త‌కి నిహారిక బ‌ర్త్‌డే విశెష్ ఎలా చెప్పిందంటే..

మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయమై పూర్తి క్లారిటీ వచ్చేసిన విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో ఆమె వివాహం జరుగనుంది. ఆగస్ట్‌లో నిహారిక, చైతన్యల నిశ్చితార్థం జరిపి, డిశంబర్ లేదంటే 2021 ఫిబ్రవరిలో పెళ్లి గ్రాండ్‌గా జరపాలని మెగాబ్రదర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక నిహారిక తనకు కాబోయే వాడిని ఇన్‌స్టాగ్రమ్ ద్వారా అందరికీ పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతని పుట్టినరోజును పురస్కరించుకుని స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రమ్‌లో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది నిహారిక. 


‘‘నీ నవ్వుతో గది మొత్తం వెలుగు నిండుతుంది. ఇంటిలో ఉన్న అనుభూతి కలిగిస్తుంది. నీ నవ్వు నా సంతోషపు చిరునామా చై. ఇదే ఎంతో మందికి మొదటిది. వీటన్నింటికంటే నువ్వు ఎంతో ఉత్తమమైన వాడివి. హ్యాపీ బర్త్‌డే లవ్..’’ అంటూ నిహారిక తనకు కాబోయే చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.Updated Date - 2020-07-27T04:34:52+05:30 IST

Read more