ఆ వీడియోకు ఇంత స్పందన ఊహించలేదు: నిహారిక

ABN , First Publish Date - 2020-04-28T17:38:09+05:30 IST

హీరోలందరూ`'బీ ది రియల్ మెన్` అంటూ ఇంట్లో భార్యలకు సాయపడుతుంటే.. మెగా ఫ్యామిలీ లేడీస్

ఆ వీడియోకు ఇంత స్పందన ఊహించలేదు: నిహారిక

 హీరోలందరూ`'బీ ది రియల్ మెన్` అంటూ ఇంట్లో భార్యలకు సాయపడుతుంటే.. మెగా ఫ్యామిలీ లేడీస్ `లాక్‌డౌన్ లేడీస్` అంటూ మరో ఛాలెంజ్‌కు తెర తీశారు. మేకప్ వేయక ముందు, వేసిన తర్వాత అంటూ డ్యాన్స్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తదితరులు కనిపించారు. ఈ వీడియో గురించి తాజాగా నిహారిక స్పందించింది. `మా ఫ్యామిలీ లేడీస్ వాట్సాప్ గ్రూపులో శ్రీజ షేర్ చేసిన ఓ వీడియో చూసి ఈ మేకప్ ఛాలెంజ్ ఆలోచన వచ్చింది. హిందీలో ఉన్న ఆ మేకప్ వీడియోను తెలుగులో చేస్తే బాగుంటుందని అనిపించింది. మెగా ఫ్యామిలీ లేడీస్ అందరినీ ఒప్పించి ఈ ఛాలెంజ్‌లో భాగం చేశాం. ఈ వీడియోకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేద`ని నిహారిక తెలిపింది.


Updated Date - 2020-04-28T17:38:09+05:30 IST