త‌మిళం నేర్చుకుంటోన్న నిధి అగ‌ర్వాల్‌

ABN , First Publish Date - 2020-05-12T14:11:42+05:30 IST

లాక్‌డౌన్ వ‌ల్ల దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని మ‌న హీర‌యిన్స్ కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ స‌ర‌స‌న బెంగుళూరు బ్యూటీ నిధి అగ‌ర్వాల్ కూడా చేరింది.

త‌మిళం నేర్చుకుంటోన్న నిధి అగ‌ర్వాల్‌

లాక్‌డౌన్ వ‌ల్ల దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని మ‌న హీర‌యిన్స్ కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ స‌ర‌స‌న బెంగుళూరు బ్యూటీ నిధి అగ‌ర్వాల్ కూడా చేరింది. ఈ అమ్మ‌డు తెలుగులో స‌వ్య‌సాచి, మిస్ట‌ర్ మ‌జ్ను, ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఇప్పుడిప్పుడే త‌మిళంలోకి అడుగు పెట్టింది. త‌మిళంలో జ‌యం ర‌వి స‌ర‌స‌న భూమి అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. ఈ లాక్‌డౌన్ వ‌ల్ల దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని నిధి అగ‌ర్వాల్ త‌మిళం నేర్చుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటుంది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. 

Updated Date - 2020-05-12T14:11:42+05:30 IST