హీరోతో డేటింగ్.. స్పందించిన నిధి!

ABN , First Publish Date - 2020-10-23T16:57:11+05:30 IST

`సవ్యసాచి` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది.

హీరోతో డేటింగ్.. స్పందించిన నిధి!

`సవ్యసాచి` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో తెలుగులో తొలి విజయం అందుకుని మరిన్ని అవకాశాలు దక్కించుకుంటోంది. 


నిధి ప్రస్తుతం ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్‌ చేస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన నిధి ఆ వార్తలపై స్పందించింది. తానెవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది.   

Updated Date - 2020-10-23T16:57:11+05:30 IST

Read more