వచ్చే నెలలో ‘దృశ్యం 2’

ABN , First Publish Date - 2020-07-03T05:03:26+05:30 IST

తన 60వ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా ‘దృశ్యం 2’ చిత్రంలో నటిస్తున్నాననీ, జీతూ జోసఫ్‌ దర్శకత్వం వహిస్తారనీ మోహన్‌లాల్‌ ప్రకటించారు...

వచ్చే నెలలో ‘దృశ్యం 2’

తన 60వ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా ‘దృశ్యం 2’ చిత్రంలో నటిస్తున్నాననీ, జీతూ జోసఫ్‌ దర్శకత్వం వహిస్తారనీ మోహన్‌లాల్‌ ప్రకటించారు. 2013లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రం దేశంలోని బెస్ట్‌ థ్రిల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ.50 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి మలయాళ సినిమా ఇదే. ఆ తర్వాత తెలుగులో, తమిళంలో కూడా ఈ సినిమా రీమేక్‌ అయింది. దానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ షూటింగ్‌ వచ్చే నెల 17న ప్రారంభం కావచ్చని చెబుతున్నారు. ఆగస్టు రెండో వారం తర్వాత షూటింగ్‌లో పాల్గొనడానికి మోహన్‌లాల్‌ అంగీకరించారనీ, తగిన జాగ్రత్తలు తీసుకొంటూ వీలయినంత తక్కువమంది యూనిట్‌ సభ్యులతో షూటింగ్‌ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. గత నెల్లోనే షూటింగ్స్‌ జరుపుకోవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ పెద్ద చిత్రాలేవీ షూటింగ్స్‌ ప్రారంభించలేదు. ‘సునామీ’ పేరుతో ఒక చిన్న సినిమా షూటింగ్‌ మాత్రం జూన్‌లో ప్రారంభమైంది. 

Updated Date - 2020-07-03T05:03:26+05:30 IST