రణ్‌బీర్-ఆలియా పెళ్లి ఎప్పుడు?
ABN , First Publish Date - 2020-10-12T21:41:02+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ వివాహం గురించి బాలీవుడ్

బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ వివాహం గురించి బాలీవుడ్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. 2017 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారని తాజాగా మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకు రావడంతో ఈ వార్తలు మొదలయ్యాయి.
రణ్‌బీర్-ఆలియా పెళ్లికి సంబంధించిన కార్యక్రమం కోసమే నీతూ డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ ఏడాది వీరి పెళ్లి ఉండదని తెలుస్తోంది. వచ్చే ఏడాది ద్వితాయర్థంలో వీరి పెళ్లి ఉండొచ్చని సమాచారం. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఈ ఇద్దరికీ లేదట. రణ్‌బీర్ తండ్రి రిషీ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించిన సంగతి తెలిసిందే.
Read more