అనువైన వరుడి కోసం అందాల భామ అన్వేషణ

ABN , First Publish Date - 2020-12-24T17:15:56+05:30 IST

టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తమిళ చిత్రరంగ ప్రవేశం

అనువైన వరుడి కోసం అందాల భామ అన్వేషణ

టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తమిళ చిత్రరంగ ప్రవేశం చేసిన అందాల భామ ప్రియా భవానీ శంకర్‌ అనువైన  వరుడి కోసం అన్వేషిస్తున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న ఆమె అభిమానులు ఆమెను శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తుతున్నారు. ప్రియా భవానీ ప్రస్తుతం ‘కురుది ఆట్టమ్‌’, ‘ఓ మణపెణ్ణే’ ‘బొమ్మై’, ‘కళత్తిల్‌ సందిప్పోమ్‌’ చిత్రాలలో నటిస్తూ బిజీగా వుంటోంది.


‘ఉలగనాయగన్‌’ కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్‌-2ౠ చిత్రంలోనూ ప్రియా భవానీ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఉన్నట్టుండి సోషల్‌ మీడియాలో ‘అనువైన వరుడికి ఇదే ఆహ్వానం’ అన్న కామెంట్‌తో తన అందమైన ఫోటోను వెలువరించి సంచలనం సృష్టించింది. ఆ ఫొటోను చూసిన అభిమానులంతా ప్రియాభవానీ శంకర్‌ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నదని తెలుసుకుని వరుసగా ‘బెస్ట్‌ ఆఫ్‌ లక్‌’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.Updated Date - 2020-12-24T17:15:56+05:30 IST