దీపిక బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?

ABN , First Publish Date - 2020-06-15T23:02:51+05:30 IST

అంగరక్షకులు లేనిదే సినీ ప్రముఖులు కాలు బయటపెట్టరు. సినిమా ఫంక్షన్లు, పబ్లిక్‌ మీటింగ్‌లు, విహార యాత్రలు..

దీపిక బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?

అంగరక్షకులు లేనిదే సినీ ప్రముఖులు కాలు కూడా బయటపెట్టరు. సినిమా ఫంక్షన్లు, పబ్లిక్‌ మీటింగ్‌లు, విహార యాత్రలు.. ఇలా ఎక్కడికి వెళ్లినా బాడీగార్డులు‌ వెంట ఉండాల్సిందే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లకు వీరి అవసరం చాలా ఎక్కువ. బాలీవుడ్ ప్రముఖ కథానాయిక దీపికా పదుకొణే దగ్గర చాలా కాలంగా ఓ బాడీగార్డ్ నమ్మకంగా పనిచేస్తున్నాడు. 


దీపిక బాడీగార్డ్ పేరు జలాల్. అతనికి దీపిక చెల్లిస్తున్న జీతం గురించి కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అతని వార్షిక జీతం అక్షరాలా కోటి రూపాయలట. దీపిక బయటకి వచ్చిందంటే ఆమె వెనుకే జలాల్ నీడ‌లా ఉంటాడు. ఆమెను కంటికి రెప్పలా కాపాడతాడు. దీపిక కూడా అతడిని స్వంత సోదరుడిలా చూసుకుంటుందట. ప్రతీ ఏటా రాఖీ కూడా కడుతుందట. ఇంతకు ముందు అతని జీతం సంవత్సరానికి రూ.80 లక్షలు ఉండేదట. ఇటీవలె అతని జీతాన్ని దీపిక కోటి రూపాయలకు పెంచిందట. 

Updated Date - 2020-06-15T23:02:51+05:30 IST