‘న్యూ’స్‌ 27 07 2020

ABN , First Publish Date - 2020-07-27T12:11:42+05:30 IST

హాలీవుడ్‌ నటుడు జాన్‌ సాక్సన్‌(83) న్యూమోనియాతో లాస్‌ ఏంజెల్స్‌లోని తన స్వగృహంలో మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య గ్లోరియా మార్టెల్‌ హాలీవుడ్‌ మీడియాకు తెలిపారు...

‘న్యూ’స్‌ 27 07 2020

హాలీవుడ్‌ నటుడు జాన్‌ సాక్సన్‌(83) న్యూమోనియాతో లాస్‌ ఏంజెల్స్‌లోని తన స్వగృహంలో మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య గ్లోరియా మార్టెల్‌ హాలీవుడ్‌ మీడియాకు తెలిపారు. ‘ఎంటర్‌ ద డ్రాగన్‌’, ‘ఎ నైట్‌మేర్‌ ఆన్‌ ఎల్మ్‌ స్ర్టీట్‌’ సినిమాలతో గుర్తింపు పొందిన ఆయన టీవీ రంగంలోనూ రాణించారు. 60 ఏళ్లలో దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించిన జాన్‌ డిటెక్టివ్‌, పోలీస్‌ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు. 


లాక్‌డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న వేలాది మందిని ఆదుకున్నారు సోనూసూద్‌. ఈ సారి కాడెద్దులుగా మారిన ఓ రైతు కూతుళ్లను చూసి సోనూ చలించిపోయారు. చిత్తూరు జిల్లాలోని మహల్‌ రాజపల్లిలో రైతు నాగేశ్వరరావు తన కుమార్తెలతో పొలం దున్నిస్తున్న వీడియో వైరల్‌ అయింది. ఆ వీడియో చూసిన సోనూ రేపటికల్లా ఎద్దులను కొనిస్తానని ప్రకటించారు. కాసేపటికే ‘ఎద్దులు కాదు.. ట్రాక్టర్‌ కొనిస్తాను’ అని మాటిచ్చారు. కొన్ని గంటల్లోనే సోనూసూద్‌ ట్రాక్టర్‌ కొనిచ్చారని నాగేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2020-07-27T12:11:42+05:30 IST

Read more