‘న్యూ’స్ 25-08-2020
ABN , First Publish Date - 2020-08-25T05:26:07+05:30 IST
‘సడక్ 2’ తర్వాత మరో చిత్రానికీ సుశాంత్ ఫ్యాన్స్ నిరసన సెగ తగులుతోంది. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్, చుంకీ పాండే కుమార్తె అనన్య జంటగా నటించిన ‘ఖాలీ పీలీ’...

‘సడక్ 2’ తర్వాత మరో చిత్రానికీ సుశాంత్ ఫ్యాన్స్ నిరసన సెగ తగులుతోంది. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్, చుంకీ పాండే కుమార్తె అనన్య జంటగా నటించిన ‘ఖాలీ పీలీ’ టీజర్ సోమవారం విడుదలైంది. దీనికి లైక్స్ కంటే డిస్‌లైక్స్ ఎక్కువ ఉన్నాయి. స్టార్ కిడ్స్ నటించడంతో ఈ సినిమాను, నెపోటిజమ్‌ను బాయ్‌కాట్ చేయాలని కొందరు పిలుపు ఇస్తున్నారు.
‘మీర్జాపుర్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌ను అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.
‘‘అంత గట్టిగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అని అందరికీ చెప్పే విరాట్‌కి అమృతను చూశాక ఏమైంది? హే ఇది నేనేనా...??’’ అంటున్నారు సాయితేజ్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. అందులో తమన్ సంగీతమందించిన ‘హే ఇది నేనేనా..’ పాటను బుధవారం విడుదల చేయనున్నారు. ఇది చెప్పడానికి ముందు సాయితేజ్ చేసిన ట్వీట్ చూసి అతడు పెళ్లి చేసుకోబోతున్నారని భావించారంతా. చివరకు, ఆయన ట్విస్ట్ ఇచ్చారు.
Read more