‘న్యూ’స్‌

ABN , First Publish Date - 2020-07-19T05:09:34+05:30 IST

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కచ్చితంగా మరో సినిమా...

‘న్యూ’స్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కచ్చితంగా మరో సినిమా చేస్తారని ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన ఛార్మీ తెలిపారు. అది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సీక్వెలా? మరొకటా? అనేది ఇప్పుడే చెప్పలేనని ఆమె అన్నారు.


‘వర్షం’, ‘ఒక్కడు’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి హిట్‌ చిత్రాలు నిర్మించిన ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ హరి’. శ్రవణ్‌రెడ్డి హీరోగా, సిమ్రత్‌ కౌర్‌, రుహానీ శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ శనివారం విడుదల చేశారు. బోల్డ్‌ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.


ప్రభాస్‌ హీరోగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించనున్న చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

Updated Date - 2020-07-19T05:09:34+05:30 IST