ట్విస్ట్: దిశా మృతి తర్వాత 9 డేస్ ఆమె ఫోన్ వాడిందెవరు?

ABN , First Publish Date - 2020-08-25T04:39:37+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు.. రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది

ట్విస్ట్: దిశా మృతి తర్వాత 9 డేస్ ఆమె ఫోన్ వాడిందెవరు?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు.. రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసు నిమిత్తం సీబీఐ అనేకమందిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు నిమిత్తమై ఓ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్.. అతనికంటే ముందే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.


అయితే ఆమె మరణం తర్వాత కూడా ఆమె ఫోన్ 9 రోజుల పాటు పనిచేసినట్లుగానూ, ఆ ఫోన్ నుంచి ఇంటర్నెట్ కాల్స్ వెళ్లినట్లుగా ఇప్పుడు కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అయితే ఆ 9 రోజులు దిశా ఫోన్ ఎవరు వాడారు? అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. సుశాంత్ రాజ్‌పుత్ లేదా రియా వీరిద్దరిలో ఎవరైనా ఆ ఫోన్‌ను వాడి ఉంటారా? ఆ ఫోన్ సంభాషణ ఎవరితో జరిగింది.. అనే మిస్టరీని చేధించే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం సుశాంత్ కేసు విషయంలో ఆయన ప్రియురాలు రియాపై సీబీఐ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆమెను అరెస్ట్ చేసి విచారించేందుకు రంగం సిద్ధమైనట్లుగా టాక్ నడుస్తుంది. 

Updated Date - 2020-08-25T04:39:37+05:30 IST