ఆండ్రియా హారర్‌ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ మార్పు

ABN , First Publish Date - 2020-10-18T16:29:59+05:30 IST

మిస్కిన్‌ దర్శకత్వంలో విడుదలైన సూపర్‌హిట్‌ చిత్రం ‘పిశాసు’. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘పిశాసు-2’ పేరుతో తాజా చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఆండ్రియా హారర్‌ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ మార్పు

మిస్కిన్‌ దర్శకత్వంలో విడుదలైన సూపర్‌హిట్‌ చిత్రం ‘పిశాసు’. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘పిశాసు-2’ పేరుతో తాజా చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజులకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను మిస్కిన్‌ అధికారి కంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తనయుడు కార్తీక్‌ రాజా సంగీతం అందించనున్నట్లు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కార్తీక్‌రాజా సంగీతం చిత్రానికి హైలైట్‌ అవుతుందని మిస్కిన్‌ తెలిపారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ‘పిశాసు’ చిత్రానికి అరోల్‌ కొరెల్లి సంగీతాన్ని అందించారు. 


Updated Date - 2020-10-18T16:29:59+05:30 IST