కొత్త కబురు అయిదు షార్ట్‌ఫిల్మ్స్... ఒక సంకలనం
ABN , First Publish Date - 2020-10-01T06:31:13+05:30 IST
అమెజాన్ ప్రైమ్ వీడియో అమెజాన్ తమిళ ఒరిజినల్ మూవీ ‘పుతంపుధు కాలై’ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. లాక్‌డౌన్ సమయంలో చిత్రీకరించిన ప్రేమకథలు...

అమెజాన్ ప్రైమ్ వీడియో అమెజాన్ తమిళ ఒరిజినల్ మూవీ ‘పుతంపుధు కాలై’ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. లాక్‌డౌన్ సమయంలో చిత్రీకరించిన ప్రేమకథలు, రెండో అవకాశాలు, కొత్త ప్రారంభాలు, ఆశతో మెరుస్తున్న కథలు వంటి అయిదు తమిళ లఘు చిత్రాల సంకలనమే పుతం పుధు కాలై. అమెజాన్ ప్రైమ్ వీడియో మొట్టమొదటి సంకలనం చిత్రం ‘పుతం పుదు కాలై’. ఇందులో అయిదుగురు ప్రముఖ దర్శకులు - సుహాసినీ మణిరత్నం, సుధా కొంగర, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజులు చిత్రించిన లఘుచిత్రాలు ఉన్నాయి. ‘పుతం పుధు కాలై’ చిత్రం ఈ నెల 16న 200 దేశాలలో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో శ్రుతీహాసన్, ఆండ్రియా జెర్మియా, జయరామ్, బాబీ సింహా తదితరులు భాగం అయ్యారు.