కొత్తగా...

ABN , First Publish Date - 2020-10-28T06:59:22+05:30 IST

సారథి దాస్‌ గ్యాంగ్‌ నరసింహపురం 1992 హనీట్రాప్‌...

కొత్తగా...

సారథి

నందమూరి తారకరత్న కథానాయకుడిగా నటిస్తున్న ‘సారథి’ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విజయదశమి సందర్భంగా విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోందని చిత్ర దర్శకుడు జాకట రమేశ్‌, నిర్మాతలు నరేశ్‌ యాదవ్‌, వై.ఎస్‌. కృష్ణమూర్తి, పి. సిద్దేశ్వరరావు తెలిపారు. 


దాస్‌ గ్యాంగ్‌ 

శివ, మణికాంత్‌, మయూరి హీరోహీరోయిన్లుగా ‘దాస్‌ గ్యాంగ్‌’ చిత్రం ప్రారంభమైంది. మాస్‌ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకొనే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్‌ మొదటి వారంలో ప్రారంభమవుతుంది.చిరంజీవి రాళ్లబండి దర్శకత్వంలో మమతా రాళ్లబండి ఈ చిత్రం నిర్మిసున్నారు.


నరసింహపురం

నందకిశోర్‌ హీరోగా, సిరి హనుమంతు హీరోయిన్‌గా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘నరసింహపురం’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. శ్రీరాజ్‌ బళ్లా దర్శకత్వంలో ఫణికుమార్‌ గౌడ్‌, నందకిశోర్‌ ధూళిపాళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


1992

మహీ రాథోడ్‌, మోనా ఠాగూర్‌ జంటగా రూపుదిద్దుకొంటున్న ‘1992’ చిత్రం లిరికల్‌ వీడియోను దర్శకుడు వి.వి.వినాయక్‌, నిర్మాత రాజ్‌ కందుకూరి ఆవిష్కరించారు. శివ పాలమూరి దర్శకత్వంలో మహి రాథోడ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


హనీట్రాప్‌...

పి. సునీల్‌ కుమార్‌రెడ్డి దర్శకత్వంలో వి.వి. వామనరావు నిర్మిస్తున్న రొమాంటిక్‌ సోషల్‌ థ్రిల్లర్‌ ‘హనీట్రాప్‌’. సాయిరుషి, తేజు అనుపోజు జంటగా నటించనున్న ఈ సినిమా చిత్రీకరణ నవంబర్‌ నుంచి విశాఖలో ప్రారంభించనున్నారు.  

Updated Date - 2020-10-28T06:59:22+05:30 IST