కొత్త జంట... కొత్త ఫొటో

ABN , First Publish Date - 2020-10-18T06:42:55+05:30 IST

కరోనా కాలంలో పెళ్లి చేసుకున్న కొత్త జంటల్లో రానా దగ్గుబాటి - మిహీకా బజాజ్‌ జంట ఒకటి. కొవిడ్‌-19 కారణంగా కుటుంబ సభ్యులు...

కొత్త  జంట... కొత్త ఫొటో

కరోనా కాలంలో పెళ్లి చేసుకున్న కొత్త జంటల్లో రానా దగ్గుబాటి - మిహీకా బజాజ్‌ జంట ఒకటి. కొవిడ్‌-19 కారణంగా కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. తాజాగా భర్తతో కలిసి దిగిన ఫొటోని సామాజిక మాధ్యమాల్లో మిహీకా పోస్ట్‌ చేశారు. అదే ఈ ఫొటో! పెళ్లి తర్వాత ఈ కొత్త జంట గోవాకి వెళ్లొచ్చినట్టు సమాచారం. బహుశా... ఈ కొత్త ఫొటో అక్కడ తీసుకున్నదేమో!? ఇక, సినిమాల విషయానికి వస్తే... నవంబర్‌ నుంచి రానా ‘విరాటపర్వం’ చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం.

Updated Date - 2020-10-18T06:42:55+05:30 IST