'శాకుంతలం'.. అనుష్క కావాలంటూ రిక్వెస్ట్‌లు

ABN , First Publish Date - 2020-10-12T04:08:57+05:30 IST

సంచలన దర్శకుడు గుణశేఖర్‌ రీసెంట్‌గా 'శాకుంతలం' అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చేయాలనుకున్న 'హిరణ్యకశ్యప' కంటే

'శాకుంతలం'.. అనుష్క కావాలంటూ రిక్వెస్ట్‌లు

సంచలన దర్శకుడు గుణశేఖర్‌ రీసెంట్‌గా 'శాకుంతలం' అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చేయాలనుకున్న 'హిరణ్యకశ్యప' కంటే ముందు ఈ చిత్రం రూపొందించనున్నట్లుగా తెలుపుతూ.. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. అయితే గుణశేఖర్‌ ఎప్పుడైతే 'శాకుంతలం' అని చెప్పి, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశాడో.. అప్పటి నుంచి ఆయనకు రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్ట్‌లు నెటిజన్ల నుంచి వస్తుండటం విశేషం. 


ఇంతకీ ఆ రిక్వెస్ట్‌లు ఏమిటని అనుకుంటున్నారా? 'శాకుంతలం' పేరు వింటే ఇది ఒక లేడీ ఓరియంటెడ్‌ చిత్రం అనేది అర్థమవుతుంది. అందుకే అందరూ 'శకుంతల' పాత్రకు స్వీటీ అనుష్కను తీసుకోవాలంటూ, ఆ పాత్రలో అనుష్కను చూడాలని ఉందంటూ దర్శకుడు గుణశేఖర్‌కు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. గుణశేఖర్‌ రూపొందించిన చరిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి'లో ఇప్పటికే అనుష్క టైటిల్‌ రోల్‌ చేసి ఉంది. అలాగే ఇటీవల 'నిశ్శబ్దం' ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో తను రెండు సినిమాలు ఓకే చేసినట్లుగా అనుష్క చెప్పుకొచ్చింది. అందులో ఒకటి ఇటీవల వార్తలు వచ్చిన విజయ్‌ దేవరకొండతో చిత్రం అనుకుంటే.. రెండో చిత్రం ఈ 'శాకుంతలం' చిత్రమే అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు. మరి చివరికి ఈ చిత్రంలో ఎవరు ఫైనల్‌ అవుతారో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే గుణశేఖర్‌కు అనుష్క కావాలంటూ నెటిజన్లు రిక్వెస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. Updated Date - 2020-10-12T04:08:57+05:30 IST

Read more