నేహా వెడ్డింగ్ డ్రెస్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

ABN , First Publish Date - 2020-10-30T17:18:41+05:30 IST

హిందీ చిత్ర సీమ ప్రముఖ గాయని నేహా కక్కర్, గాయకుడు రోహన్ ప్రీత్ సింగ్‌ వివాహం కొద్ది రోజులుగా హెడ్ లైన్స్‌లో ఉంటూ వస్తోంది.

నేహా వెడ్డింగ్ డ్రెస్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

హిందీ చిత్ర సీమ ప్రముఖ గాయని నేహా కక్కర్, గాయకుడు రోహన్ ప్రీత్ సింగ్‌ వివాహం కొద్ది రోజులుగా హెడ్ లైన్స్‌లో ఉంటూ వస్తోంది. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. అయితే అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాలను డ్రెస్సింగ్, స్టైల్ విషయంలో నేహా కాపీ కొట్టిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 


ఎరుపు రంగు లెహంగా ధరించి ఉన్న ఫొటోను నేహా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రియాంక చోప్రా తన పెళ్లి సమయంలో అచ్చం ఇదే తరహా డ్రెస్ ధరించిందని కొందరు ట్వీట్లు చేశారు. అలాగే రోహన్, నేహా క్రీమ్ కలర్ పెళ్లి దుస్తులు 2017లో జరిగిన కోహ్లీ, అనుష్కల వివాహాన్ని గుర్తు చేశాయని కొందరు విమర్శించారు.   

Updated Date - 2020-10-30T17:18:41+05:30 IST