బంధుప్రీతి అన్ని చోట్లా ఉంది

ABN , First Publish Date - 2020-07-03T05:09:11+05:30 IST

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో బంధుప్రీతి గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక్కొక్కరుగా గొంతెత్తి నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల తమన్నా...

బంధుప్రీతి అన్ని చోట్లా ఉంది

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో బంధుప్రీతి గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక్కొక్కరుగా గొంతెత్తి నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల తమన్నా కూడా బంధుప్రీతి గురించి ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. ‘‘నేను సినిమా పరిశ్రమకు సంబంధం లేని అమ్మాయిని. మా ఇంట్లో అందరూ డాక్టర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. నేనూ అదే వృత్తిని ఎంపిక చేసుకుంటే నా తల్లిదండ్రులు, సోదరుడు నాకు గైడ్‌ చేసేవారు. నటన మీదున్న ఆసక్తితో నేను ఇటు వచ్చాను. తమిళ, తెలుగు సినిమాలు మొదలుపెట్టినప్పుడు నాకు భాష రాదు. పరిచయాలు తక్కువ. జయాపజయాలతో పని లేకుండా రెండు మూడు సినిమాలు చేశాక అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. నా కష్టాన్ని, ప్రతిభను చూసిన వారు నాకు అవకాశాలు ఇచ్చారు. వాటిలో మంచి సినిమాలు సెలెక్ట్‌ చేసుకుని నటిగా నిలబడ్డాను. నాకు ఎవరూ గాడ్‌ ఫాదర్‌ లేరు. జయాపజయాలకు నా కష్టం, విధి రాతే కారణం అనుకున్నా. బంధుప్రీతి, రాజకీయాలు అన్ని రంగాల్లోనూ ఉంటాయి. అయితే అవి ఒకరి విజయాలను, పరాజయాలను నిర్దేశించలేవని నా నమ్మకం. భవిష్యత్తులో నా పిల్లలు సినీ పరిశ్రమలోకి వస్తానంటే వాళ్లకు సపోర్ట్‌గా నిలుస్తా. అందులో తప్పేమీ లేదు’’ అని తమన్నా అన్నారు. 


Updated Date - 2020-07-03T05:09:11+05:30 IST