సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ నేను లేని నా ప్రేమ‌క‌థ‌’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన దిల్‌రాజు

ABN, First Publish Date - 2020-02-15T00:45:33+05:30

డిఫరెంట్ రోల్స్‌తో తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర ఒక కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిఫరెంట్ రోల్స్‌తో తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర ఒక కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వాలంటైన్స్ డే స్సెషల్ గా ‘ నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్‌ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంచ్ చేశారు. ఒక విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉందని దిల్‌రాజు అభినందించారు. ఈ చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్ కందుకూరి నిర్మాత‌గా సురేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న  ఈ సినిమాలో న‌వీన్ చంద్ర స‌ర‌స‌న గాయ‌త్రి ఆర్ సురేష్ హీరోయిన్‌గా చేస్తుంది. క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి మ‌రో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టుడు రాజార‌వీంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సంద‌ర్బంగా నిర్మాత క‌ళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ ``దిల్ రాజుగారు మా సినిమా ఫస్ట్ లుక్‌ని విడుద‌ల చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమకథలు తెరపై చాలా కనిపించినా ఈ ప్రేమకథ అందించే ఎక్స్ పీరియన్స్ కొత్తగా ఉంటుంది.  ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ వారి వారి ప్రేమ క‌థ‌కి ద‌గ్గ‌ర‌వుతారు. న‌వీన్ చంద్ర‌, హీరోయిన్ గాయ‌త్రి ఆర్.సురేష్ వారి పాత్ర‌ల్లో ఇమిడిపోయి న‌టించారు. ఈ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకొని దిల్ రాజు గారు అభినందించారు`` అన్నారు. 

Updated Date - 2020-02-15T00:45:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!