తెలుగులో అవకాశం వస్తే సినిమాలు చేయడానికి సిద్ధం: నేహా ధూపియా

ABN , First Publish Date - 2020-12-26T23:44:53+05:30 IST

తెలుగులో విలన్‌, నిన్నేఇష్టపడ్డాను, పరమవీరచక్ర వంటి సినిమాల్లో మెప్పించిన నేహాధూపియా. తర్వాత బాలీవుడ్‌కే పరిమితం అయ్యారు. పెళ్లి చేసుకుని అమ్మ కూడా అయ్యారు.

తెలుగులో అవకాశం వస్తే సినిమాలు చేయడానికి సిద్ధం: నేహా ధూపియా

తెలుగులో విలన్‌, నిన్నేఇష్టపడ్డాను, పరమవీరచక్ర వంటి సినిమాల్లో మెప్పించిన నేహాధూపియా. తర్వాత బాలీవుడ్‌కే పరిమితం అయ్యారు. పెళ్లి చేసుకుని అమ్మ కూడా అయ్యారు. రీసెంట్‌గా ఫన్‌టాస్టిక్‌ తార ప్రోగ్రామ్‌కు నేహా ధూపియా హాజరయ్యారు. సిటీ, సినిమాల గురించి పలకరించిన ఏబీఎన్‌తో నేహా ధూపియా మాట్లాడుతూ "హైదరాబాద్‌కు ఎప్పుడొచ్చిన నా హోమ్‌ టౌన్‌కు వచ్చినట్లే అనుకుంటాను. ఫన్‌టాస్టిక్‌ తార ప్రోగ్రామ్‌కు హాజరు కావడం..నమత్ర, సితార(మహేశ్‌ కుమార్తె)ను కలవడం చాలా సంతోషంగా ఉంది. యానిమేషన్‌ వెబ్‌ సిరీస్‌కు సితార బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. సాధారణంగా ఇక్కడకు వచ్చేవాళ్లు ఇక్కడ తిండిని, చారిత్రాత్మక ప్రాంతాలను ఇష్టపడతారు. ఈసారి నాకు హైదరాబాద్‌ను చుట్టి తిరగడానికి కావాల్సినంత సమయం లేదు. రీసెంట్‌గానే పాపకు అమ్మనయ్యాను. ఇలాంటి నగరాలకు వచ్చే సమయంలో నేను, నా భర్త ముందుగానే ప్లాన్‌ చేసుకుంటాం. పాపతో ఎవరో ఒకరం ఉంటాం" అన్నారు. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు సినిమాలు చేశారుగా.. మరిప్పుడు అవకాశం వస్తే నటిస్తారా? అని అడిగితే తప్పకుండా నటిస్తాను.. అయితే నన్నెవరూ అప్రోచ్‌ కావడం లేదు అని అన్నారు నేహా ధూపియా. 
Updated Date - 2020-12-26T23:44:53+05:30 IST