రకుల్‌కు నెగెటివ్
ABN , First Publish Date - 2020-12-30T06:06:17+05:30 IST
కరోనా నుంచి కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ వారంలో కోలుకున్నారు. తాను కొవిడ్-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని...

కరోనా నుంచి కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ వారంలో కోలుకున్నారు. తాను కొవిడ్-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఈ నెల 22న ఆమె ప్రకటించారు. అప్పట్నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. మంగళవారం కరోనా నుంచి కోలుకున్నట్టు రకుల్ వెల్లడించారు. ‘‘కొవిడ్-19 పరీక్షల ఫలితాల్లో నెగెటివ్ అని వచ్చిన విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. నేనిప్పుడు చాలా బావున్నాను. అందరి ప్రేమాభిమానాలు, త్వరగా కోలుకోవాలని చేసిన ప్రార్థనలకు కృతజ్ఞురాలిని. 2021ను ఆరోగ్యంతో, ఆశావాహ దృక్పథంతో ప్రారంభిస్తా. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించండి. మాస్కులు ధరించండి. జాగ్రత్తలు తీసుకోండి’’ అని రకుల్ పేర్కొన్నారు.
Read more