ఒంటరిగా ఉన్న భావన కలుగుతోంది..నీతూ కపూర్‌

ABN , First Publish Date - 2020-11-17T11:29:07+05:30 IST

రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ ఆరేళ్ల తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై సందడి చేయనున్నారు. ‘జగ్‌ జుగ్‌ జియో’ చిత్రంతో ఆమె మళ్లీ నటిగా ప్రేక్షకుల్ని అలరించనున్నారు

ఒంటరిగా ఉన్న భావన కలుగుతోంది..నీతూ కపూర్‌

రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ ఆరేళ్ల తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై సందడి చేయనున్నారు. ‘జగ్‌ జుగ్‌ జియో’ చిత్రంతో ఆమె మళ్లీ నటిగా ప్రేక్షకుల్ని అలరించనున్నారు. అనిల్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, కియారా అడ్వాణీ నటీనటులుగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నీతూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోమవారం ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారామె. ఇటీవల భర్తను కోల్పోయిన ఆమె సెట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘చాలాకాలం తర్వాత సెట్‌లో అడుగుపెట్టాను. ఏదో తెలియని భయం, ఒంటరిగా ఉన్న భావన కలిగించింది. కొత్త ప్రారంభంలా ఉంది. సినిమా మ్యాజిక్‌ ఇలాగే ఉంటుందనుకుంటా. రణ్‌బీర్‌ ఉన్నాడనే ధైర్యంతో ముందుకెళ్తున్నా. ఇప్పుడు నాకు నేనుగా అన్ని విషయాలు తెలుసుకుంటున్నా. మీరు ఏ లోకంలో ఉన్నా నాకు అండగా ఉంటారని నమ్ముతున్నా(రిషి కపూర్‌ను ఉద్దేశించి)’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో షూటింగ్‌లో ఉన్న ఫొటో చేసి పేర్కొన్నారు. అనిల్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, రిద్దిమా, మనీష్‌ మల్హోత్ర, వరుణ్‌ ధావన్‌ వంటి బాలీవుడ్‌ సెలబ్రిటీలు ‘మీకు మేం అండగా ఉంటాం’ అని నీతూకి భరోసా ఇచ్చారు.

Updated Date - 2020-11-17T11:29:07+05:30 IST