సినిమా కథతో...
ABN , First Publish Date - 2020-12-20T04:54:34+05:30 IST
అసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటిస్తున్న చిత్రం ‘నేడే విడుదల’. రామ్ రెడ్డి పన్నాల దర్శకుడు. మస్తాన్ ఖాన్ నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకనిర్మాతలు మాట్లాడుతూ....

(చిత్రజ్యోతి బ్యూరో): అసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటిస్తున్న చిత్రం ‘నేడే విడుదల’. రామ్ రెడ్డి పన్నాల దర్శకుడు. మస్తాన్ ఖాన్ నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘సినిమా ఇండస్ర్టీలోని ఓ పాయింట్‌ను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. ఇటీవల ప్రేక్షకుల చేతులమీదుగా విడుదల చేసిన పాటకు చక్కని స్పందన వచ్చింది. శ్రీమణి సాహిత్యం, అజయ్ సంగీతం సినిమాకు ఎసెట్ అవుతాయి’’ అని అన్నారు. కాశీవిశ్వనాథ్, అప్పాజీ, చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.