నయనతార ‘వసంతకాలం’ రెడీ ఫర్ రిలీజ్

ABN , First Publish Date - 2020-02-21T05:02:47+05:30 IST

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని ‘వసంత కాలం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు

నయనతార ‘వసంతకాలం’ రెడీ ఫర్ రిలీజ్

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని ‘వసంత కాలం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. ‘బిల్లా-2’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సందర్భంగా ఇంతకుముందు ‘ఏకవీర, వేటాడు-వెంటాడు’ వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగిన నయనతార నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘వసంతకాలం’. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది..’’ అన్నారు.

Updated Date - 2020-02-21T05:02:47+05:30 IST