నయనతార ‘నెట్రికన్‌’ ఫస్ట్ లుక్‌ వచ్చేసింది

ABN , First Publish Date - 2020-10-23T03:56:20+05:30 IST

స్టార్‌ హీరోయిన్‌ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'నెట్రికన్‌'. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను గురువారం అధికారికంగా విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాని

నయనతార ‘నెట్రికన్‌’ ఫస్ట్ లుక్‌ వచ్చేసింది

స్టార్‌ హీరోయిన్‌ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'నెట్రికన్‌'. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను గురువారం అధికారికంగా విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాని నయనతారతో ప్రేమలో ఉన్న విఘ్నేష్‌ శివన్‌ నిర్మిస్తుండటం. ఈ చిత్రంతో దర్శకుడైన విఘ్నేష్‌ శివన్‌ నిర్మాతగానూ మారుతున్నారు. రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి 'గృహం' చిత్రంతో అందరి మన్ననలు పొందిన మిలింద్‌ రౌ దర్శకుడు. గిరిష్‌ జి సంగీతం అందిస్తున్నారు. 


ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ విడుదల సందర్భంగా తమిళ సెలబ్రిటీలు  చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్‌ ట్విట్టర్‌ ద్వారా చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఫస్ట్ లుక్‌లో నయనతారను చూస్తుంటే.. ఇది ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమనేది అర్ధమవుతోంది. Updated Date - 2020-10-23T03:56:20+05:30 IST

Read more