ప్రైవేట్ జెట్‌లో ప్రియుడితో నయన్!

ABN , First Publish Date - 2020-08-31T21:38:49+05:30 IST

దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తాజాగా కోచిలో దర్శనమిచ్చారు.

ప్రైవేట్ జెట్‌లో ప్రియుడితో నయన్!

దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తాజాగా కోచిలో దర్శనమిచ్చారు. విరామ స‌మ‌యం దొరికితే చాలు విహార యాత్ర‌ల‌కు బయలుదేరే ఈ ప్రేమ ప‌క్షులు ప్రైవేటు జెట్ విమానంలో చెన్నై నుంచి కోచి చేరుకున్నారు. కేర‌ళ‌లో జ‌రుపుకునే అతి ముఖ్య‌మైన‌ ఓనం పండ‌గ కోసం వీరిద్దరూ అక్కడకు వెళ్లారు. 


నయన్ కుటుంబ సభ్యులతో పాటు విఘ్నేశ్ కూడా ఓనం పండుగను జరుపుకోబోతున్నాడు. కోచి విమానాశ్రయంలో వీరిద్దరూ నడిచి వెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. డేటింగ్ బోర్ కొట్టినప్పుడు కచ్చితంగా పెళ్లి  చేసుకుంటామని విఘ్నేశ్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.


Updated Date - 2020-08-31T21:38:49+05:30 IST