ఆదిశక్తి నయనతార!

ABN , First Publish Date - 2020-06-05T05:13:01+05:30 IST

నయనతార ఆదిశక్తి అవతారమెత్తారు. బలమైన పాత్రలు, గ్లామర్‌తో అలరించిన ఆమె ‘మూక్కుత్తి అమ్మన్‌’ చిత్రంలో తొలిసారి దేవత పాత్రలో కనిపించనున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని...

ఆదిశక్తి నయనతార!

నయనతార ఆదిశక్తి అవతారమెత్తారు. బలమైన పాత్రలు, గ్లామర్‌తో అలరించిన ఆమె ‘మూక్కుత్తి అమ్మన్‌’ చిత్రంలో తొలిసారి దేవత పాత్రలో కనిపించనున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని స్టిల్స్‌ను నయనతార సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి ‘మూక్కుత్తి అమ్మన్‌ సెట్‌లో’ అని రాసుకొచ్చారు. అమ్మవారిగా నయనతార సరిగ్గా సరిపోయిందంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు ఆర్జే బాలాజీ మాట్లాడుతూ ‘‘పూర్తిగా ఆధ్యాత్మిక చిత్రమిది. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన భక్తి చిత్రాల్లో ఉన్న అంశాలన్నీ ఇందులో ఉంటాయి’’ అని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్‌, కార్తీ హీరోలుగా కొంత షూటింగ్‌ జరిగి ఆగిపోయిన ‘కరుప్పు రాజా వేలై రాజా’ చిత్రం మళ్లీ సెట్స్‌ మీదకి వెళ్లబోతుందనీ, అందులో ప్రభుదేవా, నయనతార కలిసి నటించబోతున్నారనీ వార్తలు తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఆ చిత్ర నిర్మాత ఇశారీ కె గణేశ్‌ స్పందించారు. ‘‘రెండేళ్ల క్రితం ‘కరుప్పు రాజా వేలై రాజా’ సినిమా ఆగిపోయిన మాట వాస్తవం. అసలు ఆ సినిమా పూర్తి చేసే ఉద్దేశం నాకు లేదు’’ అని ఆయన తేల్చి చెప్పారు. 


Updated Date - 2020-06-05T05:13:01+05:30 IST