పెళ్లి ఏమోగానీ.. డీప్‌ లవ్‌లో నయన్‌, విఘ్నేష్

ABN , First Publish Date - 2020-11-14T05:14:52+05:30 IST

నయనతార ఎప్పుడూ హాట్‌ టాపిక్కే. అటు సినిమాల పరంగానూ, ఇటు ప్రేమవ్యవహారాల విషయంలోనూ ఆమె పేరు టాప్‌ ప్లేస్‌లోనే ఉంటుంది. హీరోయిన్‌గా

పెళ్లి ఏమోగానీ.. డీప్‌ లవ్‌లో నయన్‌, విఘ్నేష్

నయనతార ఎప్పుడూ హాట్‌ టాపిక్కే. అటు సినిమాల పరంగానూ, ఇటు ప్రేమవ్యవహారాల విషయంలోనూ ఆమె పేరు టాప్‌ ప్లేస్‌లోనే ఉంటుంది. హీరోయిన్‌గా టాప్‌ ప్లేస్‌లో.. ఇంకా చెప్పాలంటే లేడీ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాల విషయానికి వస్తే.. ఇప్పటికే పెళ్లి వరకు వెళ్లి.. చివరి నిమిషంలో తన ప్రేమికుల నుంచి బ్రేకప్‌ అవుతూ వస్తుంది. ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. మరి విఘ్నేష్‌నైనా పెళ్లి చేసుకుంటావా అంటే.. మీకెందుకు అంటుంది. పబ్లిక్‌లో మాత్రం వీరిద్దరూ భార్యభర్తల కంటే ఎక్కువ అన్నట్లుగా ఫోజులిస్తుంటారు. తాజాగా విఘ్నేష్‌ శివన్‌ షేర్‌ చేసిన ఫొటో చూస్తే.. వీరిద్దరూ ఎంత డీప్‌ లవ్‌లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. మరి వీరి ఘాటు ప్రేమ.. పెళ్లిగా ఎప్పుడు మారుతుందో చూద్దాం.Updated Date - 2020-11-14T05:14:52+05:30 IST