అది నిజం కాదంటున్న నయనతార!

ABN , First Publish Date - 2020-12-30T20:27:21+05:30 IST

భారత్‌లో ఈస్టిండియా కంపెనీ మీద పోరాటం చేసిన తొలి రాణిగా వేలు నాచియర్ చరిత్రకెక్కారు.

అది నిజం కాదంటున్న నయనతార!

భారత్‌లో ఈస్టిండియా కంపెనీ మీద పోరాటం చేసిన తొలి రాణిగా వేలు నాచియర్ చరిత్రకెక్కారు. ఈమె జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ రూపొందుతోందని, అందులో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తోందని తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది పూర్తిగా అవాస్తవమని నయనతార కొట్టిపారేసింది. 


వేలు నాచియర్ పాత్రలో నయనతార నటించడం లేదని తెలియజేస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదలైంది. `వేలు నాచియర్ బయోపిక్‌లో నయనతార నటిస్తోందంటూ ఓ వార్త మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అది నిజం కాదు. అది పూర్తిగా నిరాధారమైన వార్త. ఇలాంటి వార్తలను పబ్లిష్ చేసే ముందు సరి చూసుకోవాల్సిందిగా కోరుతున్నామ`ని ఆ లేఖలో పేర్కొన్నారు. Updated Date - 2020-12-30T20:27:21+05:30 IST